
Somerset vs Surrey: 1 ఫ్రేమ్‌లో 13 మంది ఆటగాళ్లు.. సోషల్ మీడియాలో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అంటే అభిమానులకు ఎందుకంత ఆసక్తి అనే ప్రశ్నకు ఇలాంటి వీడియోనే ప్రత్యక్ష సమాధానం.
మ్యాచ్‌లో విజయానికి కృషి చేసిన ఇరు జట్లు చివరి వరకు పోరాడుతుంటాయి.
తాజాగా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో సోమర్‌సెట్,సర్రే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. ఈ సందర్భంగా అరుదైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సోమర్‌సెట్ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సర్రే జట్టు 109/9 స్కోరు వద్ద నిలిచింది.
మ్యాచ్ చివరిరోజు ముగియబోతుండగా, సోమర్‌సెట్ ప్రత్యేకంగా ఒక ప్లాన్ సిద్ధం చేసింది.
చివరి వికెట్‌ను సాధించడానికి బౌలర్, వికెట్ కీపర్ తప్ప మిగతా 9 మంది ఫీల్డర్లను బ్యాటర్ సమీపంలో నిలిపింది.
వివరాలు
11 మంది ప్లేయర్లు ఒకే ఫ్రేమ్‌లో..
లీచ్ వేసిన బంతిని బ్యాటర్ వార్రల్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు కానీ, బంతి ప్యాడ్లను తాకింది. అంపైర్ ఔట్‌ను ప్రకటించారు.
దీంతో సర్రే 109 పరుగులకు ఆలౌటై 111 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ సందర్భంగా, సోమర్‌సెట్ జట్టు మొత్తం 11 మంది ప్లేయర్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొదట బ్యాటింగ్ చేసిన సోమర్‌సెట్ మొదటి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది. తరువాత సర్రే కూడా 321 పరుగులు చేసి నాలుగు పరుగుల ఆధిక్యత సాధించింది.
రెండవ ఇన్నింగ్స్‌లో, సోమర్‌సెట్‌ను 224 పరుగులకు ఆలౌటుచేయడంతో, సర్రే లక్ష్య ఛేదనలో మడత పడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
❤️ Cricket ❤️#SOMvSUR#WeAreSomerset pic.twitter.com/S7IrAEMezz
— Somerset Cricket (@SomersetCCC) September 12, 2024