Ravindra Jadeja: టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు.. రవీంద్ర జడేజా అరుదైన ఘనత
టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. నాల్గవ రోజు భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఆయన టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు సాధించిన 38వ బౌలర్‌గా రికార్డుకెక్కాడు. భారత్ తరుఫున ఈ ఘనత సాధించిన 7వ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అనిల్ కుంబ్లే (619), రవిచంద్రన్ అశ్విన్ (522), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311) తర్వాత 300 వికెట్లు సాధించిన నాలుగో భారత స్పిన్ బౌలర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు.
2012లో టెస్టులో అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా
2012లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జడేజా ఇప్పటివరకు 74 టెస్టులు ఆడారు. 138 ఇన్నింగ్స్‌లలో 24 సగటుతో 300 వికెట్లు పడగొట్టాడు. 11 సార్లు 5 వికెట్లు తీశారు. జడేజా అత్యుత్తమంగా 7/42 సాధించి సత్తా చాటాడు. బ్యాటింగ్‌లో జడేజా 36.72 సగటుతో 3,122 పరుగులు సాధించారు. ఇందులో 4 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు ఉన్నాయి.