IND vs WI 4th T20: వెస్టిండిస్‌ను చిత్తు చేసిన టీమిండియా; సిరీస్ 2-2తో సమం
ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. జైశ్వాల్, గిల్ అద్భుతమైన అర్థశతకాలతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్2-2తో సమంగా ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్20 ఓవర్లలో 178/8స్కోర్ చేసింది. షిమ్రాన్ హెట్మెయర్ 61 పరుగులతో సత్తా చాటాడు. వాస్తవానికి హెట్మెయర్ రాకముందు విండీస్ స్కోరు 57/4గా ఉంది. కానీ హెట్మెయర్ వచ్చాక వెస్టిండిస్ స్కోరు బోర్డు పరులుగు పెట్టింది. షాయ్ హోప్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ 3/38తో మెరుగైన బౌలింగ్ చేసాడు. కుల్దీప్ యాదవ్ తన నాలుగు ఓవర్లలో 2/26సాధించి భారత్ తరఫున ఆకట్టుకున్నాడు. ఛేజింగ్‌లో ఓపెనర్లిద్దరూ ఇబ్బంది పడకపోవడంతో భారత్ (179/1)విండీస్‌ను పక్కనపెట్టింది.
భాగస్వామ్యంలో యశస్వి- గిల్ రికార్డు
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు కేవలం 17 ఓవర్లలోనే విండీస్ నిర్దేశించిన 178పరుగులు లక్ష్యాన్ని ఛేందించింది. యశస్వి జైశ్వాల్, గిల్‌ల ద్వయం అద్భుత ప్రదర్శన చేశారు. ఈ ఇద్దరు మొదటి వికెట్‌కు 165 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20లో భారత్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 165 పరుగులు భాగస్వామ్యాన్ని రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్‌లు నెలకొల్పారు. ఇప్పుడు యశస్వి జైశ్వాల్, గిల్ వీరి సరసన చేరారు. 2022లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్, దీపక్ హుడా జోడి చేసిన 176 (రెండో వికెట్) పరుగులు టీ20ల్లో భారత్ భాగస్వామ్య అత్యుత్తమ స్కోరు. యశస్వి 84 పరుగులు(నాటౌట్), గిల్ 77 పరుగులు చేశారు.