
CPL 2025: 8 బంతుల్లో 7 సిక్సర్లు.. సీపీఎల్‌లో పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్
ఈ వార్తాకథనం ఏంటి
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025లో కిరాన్ పొలార్డ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రగిలిపోతున్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో అతను వరుస సిక్సర్లతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. కేవలం 29 బంతుల్లో 224.14 స్ట్రైక్ రేట్‌తో 65 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రినిబాగో నైట్ రైడర్స్ (TKR) 179 పరుగులు చేసింది. లక్ష్యం చేధించేందుకు దిగిన ఎస్‌కేఎన్ పాట్రియట్స్ 167 పరుగులకే పరిమితమవడంతో, టీకేఆర్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Details
8 బంతుల్లో 7 సిక్సులు
పొలార్డ్ తన ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలుపెట్టాడు. తొలి 13 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఒకసారి రిథమ్ పట్టుకున్నాక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 15వ ఓవర్‌లో నవీన్ బిడేసి బౌలింగ్‌లో మూడో, నాలుగో బంతికి వరుస సిక్సర్లు బాదాడు. ఐదో బంతిని మిస్ చేసినా, ఆరో బంతికి మరో భారీ సిక్స్ కొట్టాడు. తర్వాతి ఓవర్‌లో, ఆఫ్గానిస్తాన్ బౌలర్ వకార్ సలాంఖైల్ వేసిన 16వ ఓవర్‌లో మూడో, నాలుగో, ఐదో, ఆరవ బంతులన్నింటికీ సిక్సర్లు బాదాడు. దీంతో పొలార్డ్ తన చివరి 8 బంతుల్లో 7 సిక్సర్లు కొట్టాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
Details
పూరన్‌తో పొలార్డ్ దూకుడు
TKR ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు కోలిన్ మున్రో (17), అలెక్స్ హేల్స్ (7) పెద్దగా రాణించలేకపోయారు. తర్వాత డారెన్ బ్రావో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే పొలార్డ్‌కు తోడుగా నికోలస్ పూరన్ 38 బంతుల్లో 52 పరుగులు (3 సిక్సర్లు, 4 ఫోర్లు) చేసి కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆ జట్టు 180 పరుగుల టార్గెట్ నిలిపింది.
Details
పాట్రియట్స్ పోరాటం వృథా
లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌కేఎన్ పాట్రియట్స్‌కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు 96 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఎవిన్ లూయిస్ 25 బంతుల్లో 42 (4 సిక్సర్లు), ఆండ్రే ఫ్లెచర్ 54 బంతుల్లో 67 పరుగులు చేశారు. కానీ ఈ ఇద్దరు అవుట్ అయిన తర్వాత పాట్రియట్స్ రన్‌చేజ్ కుదరక, చివరికి 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. TKR బౌలర్లలో మహమ్మద్ అమీర్ 2 వికెట్లు, నాథన్ ఎడ్వర్డ్ 3 వికెట్లు తీశారు. పొలార్డ్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్ గెలిపించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.