Page Loader
టీమిండియా మాజీ ప్లేయర్‌కు తప్పిన పెను ప్రమాదం
టీమిండియా మాజీ ప్లేయర్‌కు తప్పిన పెను ప్రమాదం

టీమిండియా మాజీ ప్లేయర్‌కు తప్పిన పెను ప్రమాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2023
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు త్రుటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి ఓ ట్రక్కును ఢీకొట్టింది. మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని పాండవ నగర్ నుంచి మీరట్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్ కారు నుజ్జునుజ్జుయ్యింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ల్యాండ్ రోవర్ కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రవీణ్ కుమార్, అతని కొడుకు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న స్థానికులు శబ్దాన్ని విని ఉలిక్కిపడ్డారు. వెంటనే ట్రక్ డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Details

ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని మీరట్ ఎస్‌పీ పియూష్ కుమార్ మీడియాకు వివరించారు. ఇక రోడ్డు ప్రమాదానికి గురవ్వడం ప్రవీణ్ కుమార్‌కు ఇది తొలిసారి కాదు. 2007లో ఓపెన్ జీప్ లో మీరట్ వస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రవీణ్ కుమార్ మీరట్‌లోని బాగ్‌పత్ రోడ్‌లో ఉన్న ముల్తాన్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్ టీమిండియా తరుపున 68 వన్డేల్లో 77 వికెట్లను పడగొట్టాడు. అదే విధంగా ఐపీఎల్‌లో 119 మ్యాచులు ఆడి 90 వికెట్లు తీశాడు.