
Jofra Archer: నాలుగేళ్ల విరామం తర్వాత జోఫ్రా అర్చర్‌కి అవకాశం.. లార్డ్స్‌లో ఇంగ్లండ్ వ్యూహం ఫలిస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు గురువారం నుంచి లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ కీలక మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కేవలం ఒక్క మార్పు జరిగింది. నాలుగేళ్ల విరామం తర్వాత ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. జోష్ టంగ్ స్థానంలో అర్చర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. లార్డ్స్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండేలా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Details
2021లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన జోఫ్రా ఆర్చర్
ఈ నేపథ్యంతోనే అర్చర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జోఫ్రా అర్చర్ చివరిసారి టెస్టు క్రికెట్ ఆడాడు. 2021 ఫిబ్రవరిలో అది కూడా భారతే ప్రత్యర్థిగా. ఇప్పుడు మళ్లీ భారత జట్టుతోనే తన టెస్టు రీ ఎంట్రీ చేస్తున్నాడు. ఇంతకుముందు రెండో టెస్టు మ్యాచ్‌లో అర్చర్ ఆడతాడని అంచనా వేసినప్పటికీ, పూర్తిగా ఫిట్ కానందున అతనికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఫిట్‌నెస్ తిరిగి సాధించిన అనంతరం మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ, "జోఫ్రా పూర్తిగా ఫిట్. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల ద్వారా తన ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. నాలుగేళ్ల విరామం తర్వాత టెస్టు ఆడేందుకు అతడు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడని పేర్కొన్నారు.
Details
రెండో టెస్టులో భారత్ విజయం
ఇంగ్లండ్ జట్టు వ్యూహపరంగా అర్చర్‌ను తీసుకోవడం ఎంతో ముఖ్యం. గత రెండు టెస్టుల్లో భారత టాప్ ఆర్డర్ బలంగా రాణించింది. మొదటి టెస్టులో భారీ స్కోర్ చేసినా చివర్లో ఓటమి ఎదురైంది. కానీ రెండో టెస్టులో భారత బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా ఓపెనర్లు ఇంగ్లాండ్ బౌలర్లను కనికరించలేదు. ఈ నేపథ్యంలో అర్చర్‌ను జట్టులోకి తీసుకుని, టాప్ ఆర్డర్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపాలనే వ్యూహంతో ఇంగ్లాండ్ దిగుతోంది. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సిందే.
Details
మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే
జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా అర్చర్, షోయబ్ బషీర్.