Page Loader
పాక్ క్రికెటర్‌కు ఘోర అవమానం.. బాడీ షేమింగ్‌ చేస్తూ..!
ఆజం ఖాన్ హేళన చేస్తున్న పాక్ అభిమాని

పాక్ క్రికెటర్‌కు ఘోర అవమానం.. బాడీ షేమింగ్‌ చేస్తూ..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2023
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20ల్లో చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20ల్లో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో అఫ్గాన్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో పాక్ సీనియర్ల ఆటగాళ్లకు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది. యువ ఆటగాళ్లకు అవకాశాన్ని కల్పించినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా పాక్ యువ కీపర్ అజం ఖాన్ నిరాశపరిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20ల్లో ఆజం ఖాన్ కేవలం 4 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేశాడు. ఆజం ఖాన్ ఆటతీరు చూసి అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓ అభిమాని ఏకంగా అతనిపై బాడీ షేమింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు.

పాకిస్థాన్

ఆజం ఖాన్ హావభావాలతో బాడీ షేమ్ చేసిన అభిమాని

ఆజం ఖాన్ రెండో టీ20లో ఔట్ అయి పెవిలియానికి వెనుతిరిగి వెళ్తుతుండగా.. ఓ అభిమాని అతని హావభావాలతో బాడీ షేమ్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదటి టీ20ల్లో డకౌట్ అయిన ఆజం.. కీపింగ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. మ్యాచ్ విషయానికొస్తే.. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘన్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. దీంతో పాక్‌పై తొలి టీ20 సిరీస్‌ను ఆప్ఘన్ కైవసం చేసుకుంది.