పేదరికాన్ని జయించి.. వరల్డ్ కప్ జట్టుకు నెట్ బౌలర్ గా ఎంపికైన ఫుడ్ డెలివరీ బాయ్
ఇండియాలో క్రికెట్ ఉన్న క్రేజ్ అంత కాదు. పిల్లల నుంచి పెద్దల వరకూ క్రికెట్‌ను ఇష్టపడతారు. క్రికెట్‌లో రాణించడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి పేదరికాన్ని జయించి వరల్డ్ కప్ జట్టుకు నెట్ బౌలర్ గా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్విగ్గిలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల లోకేష్ కుమార్ నెదర్లాండ్ జట్టుకు నెట్ బౌలర్‌గా పనిచేయనున్నాడు. బెంగళూరు శివార్లలోని ఆలూరులో వరల్డ్ కప్ కోసం సిద్ధం అవుతున్న డచ్ జట్టుకు లోకేష్ కుమార్ తన వంతు సహకారాన్ని అందించనున్నాడు. వరల్డ్ కప్ ప్రాక్టీస్ కోసం నెట్ బౌలర్లు కావాలని డచ్ జట్టు ప్రకటన చేసింది.
యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న లోకేష్ కుమార్
దీనికి భారత్ నుంచి 10వేల మంది తమ అప్లికేషన్ వేశారు. ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన నెదర్లాండ్స్ మేనేజ్ మెంట్ నలుగుర్ని నెట్ బౌలర్లుగా ఖరారు చేసింది. ఎంపికైన వారిలో హేమంత్ కుమార్, రాజమణి ప్రసాద్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు కాగా, హర్ష శర్మ, చైన్నైకి చెందిన లోకేశ్ కుమార్ మిస్టరీ స్పిన్నర్‌గా ఎంపికయ్యారు. 8 ఏళ్ల క్రితం పేసరగా కెరీర్ ప్రారంభించిన తర్వాత మిస్టరీ స్పిన్నర్ గా లోకేష్ కుమార్ మారాడు. నెదర్లాండ్ జట్టు తనను నెట్ బౌలర్‌గా ఎంపిక చేయడం పట్ల లోకేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఫుడ్ డెలవరీ చేయడం ద్వారా వచ్చే డబ్బులతోనే తన అవసరాలను తీర్చుకున్నానని లోకేష్ కుమార్ చెప్పారు.