Page Loader
IND vs PAK: ఇండియా, పాక్ మ్యాచుకు ముందు ఐదు ప్రశ్నలను సంధించిన మాజీ క్రికెటర్
ఇండియా, పాక్ మ్యాచుకు ముందు ఐదు ప్రశ్నలను సంధించిన మాజీ క్రికెటర్

IND vs PAK: ఇండియా, పాక్ మ్యాచుకు ముందు ఐదు ప్రశ్నలను సంధించిన మాజీ క్రికెటర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2023
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ సమరం నేటి నుంచి ప్రారంభమైంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదుచూస్తున్న భారత్, పాక్ దయాదుల పోరు సెప్టెంబర్ 2న మొదలు కానుంది. ఇప్పటికే టీమిండియా ఆడే తొలి రెండు మ్యాచులకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండనని బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్విట్టర్ వేదికగా ఐదు ప్రశ్నలను సంధించాడు. భారత జట్టులో నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న దానిపై ఓ స్పష్టత ఇవ్వాలని కోరారు. కొందరు అభిమానులు ట్విట్టర్ వేదికగా సమాధానాలు ఇస్తుండగా, మరికొందరు భారత జట్టు ఎంపికపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Details

చొప్రా సంధించిన ప్రశ్నలివే!

ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే, శుభ్‌మన్‌ గిల్ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు చేస్తాడని చోప్రా పేర్కొన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, ఇషాన్ కిషన్‌ వరుసగా 1 , 2 , 3 స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తే, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడా అని చొప్రా అనుమానం వ్యక్తం చేశాడు. రోహిత్ - గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే ఇషాన్‌ కిషన్ ను ఐదో స్థానంలో ఆడిస్తారని, లేకపోతే తిలక్, సూర్యకుమార్‌ యాదవ్ ఆ స్థానంలో బ్యాటింగ్ కు దింపుతారా అని చొప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. చొప్రా ప్రశ్నలకు నెటిజన్లు వివిధ రూపంలో కామెంట్లు పెడుతున్నారు.