LOADING...
WPL 2026 Prize Money : ఆర్‌సీబీకి కోట్ల పంట.. డబ్ల్యూపీఎల్‌ 2026 విన్నింగ్ ప్రైజ్‌మనీ ఎంతంటే?
ఆర్‌సీబీకి కోట్ల పంట.. డబ్ల్యూపీఎల్‌ 2026 విన్నింగ్ ప్రైజ్‌మనీ ఎంతంటే?

WPL 2026 Prize Money : ఆర్‌సీబీకి కోట్ల పంట.. డబ్ల్యూపీఎల్‌ 2026 విన్నింగ్ ప్రైజ్‌మనీ ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2026
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌ 2026)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన సత్తా చాటింది. గురువారం వడోదర వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్‌సీబీ రెండోసారి డబ్ల్యూపీఎల్‌ ఛాంపియన్‌గా నిలవగా, అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో సమానంగా నిలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా నాలుగో ఫైనల్ ఓటమి కావడం విశేషం. విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ.6 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా, రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ.3 కోట్ల బహుమతి లభించింది.

Details

స్మృతి మంధానకు ఆరెంజ్ క్యాప్

ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రత్యేక అవార్డులు కూడా అందజేశారు. బ్యాటింగ్‌లో నిలకడగా రాణించిన స్మృతి మంధాన అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను అందుకోగా, బౌలింగ్‌లో ప్రభావవంతమైన ప్రదర్శన కనబరిచిన సోఫీ డివైన్ పర్పుల్ క్యాప్‌ను గెలుచుకుంది. వీరిద్దరికీ చెరో రూ.5 లక్షల నగదు బహుమతి అందింది.

Details

డబ్ల్యూపీఎల్‌ 2026 అవార్డులు, ప్రైజ్‌మనీ వివరాలు ఇలా ఉన్నాయి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (విజేత) - రూ.6 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ (రన్నరప్) - రూ.3 కోట్లు MVP ఆఫ్ ది ఇయర్ - సోఫీ డివైన్ - రూ.5 లక్షలు ఆరెంజ్ క్యాప్ - స్మృతి మంధాన - రూ.5 లక్షలు పర్పుల్ క్యాప్ - సోఫీ డివైన్ - రూ.5 లక్షలు అత్యధిక సిక్సర్లు - హర్మన్‌ప్రీత్ కౌర్ - రూ.5 లక్షలు అత్యధిక డాట్ బాల్స్ - లారెన్ బెల్ - రూ.5 లక్షలు ఈ సంవత్సరంలో అత్యధిక IQ - సోఫీ డివైన్ - రూ.5 లక్షలు

Advertisement

Details

మరోసారి సత్తా చాటిన ఆర్సీబీ

ఉత్తమ స్ట్రైక్ రేట్ - గ్రేస్ హారిస్ - రూ.5 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ - నందిని శర్మ - రూ.5 లక్షలు ఫెయిర్ ప్లేయర్ అవార్డు - ముంబై ఇండియన్స్ - రూ.5 లక్షలు ఫైనల్ మ్యాచ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ - స్మృతి మంధాన - రూ.2.5 లక్షలు ఈ విజయంతో ఆర్‌సీబీ మహిళల జట్టు డబ్ల్యూపీఎల్‌లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. అభిమానులు ఇప్పుడు తదుపరి సీజన్‌లో హ్యాట్రిక్ టైటిల్ ఆశలతో ఎదురుచూస్తున్నారు.

Advertisement