Page Loader
ICC Worlc Cup 2023: విజయోత్సాహంలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్
విజయం మీద ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్

ICC Worlc Cup 2023: విజయోత్సాహంలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2023
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి విజయాన్ని నమోదు చేసిన న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించి ఈ మెగా టోర్నీలో బోణి కొట్టింది. రేపు హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్, ఈ మ్యాచులో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచుకు ముందు కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. అతను ఇంకా పూర్తి స్థాయి పిట్ నెస్ సాధించకపోవడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు.

Details

నెదర్లాండ్  మ్యాచులో లూకీ ఫెర్గూసన్ కు  స్థానం

ఇక ఇంగ్లండ్ మ్యాచుకు దూరమైన పేసర్ లూకీ ఫెర్గూసన్ మాత్రం నెదర్లాండ్‌తో జరిగే మ్యాచుకు అందుబాటులోకి వస్తాడని గ్యారీ స్టెడ్ పేర్కొన్నారు. మరోవైపు కేన్ విలియమ్సన్ మూడో మ్యాచులో జట్టులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కేన్ అంతర్జాతీయ క్రికెట్‌కు అవసరమైన పూర్తిస్థాయి ఫిట్ నెస్‌ను సాధించాడా లేదా అన్నదే ఇప్పుడు చూడాలని, అతనిపై ఎలాంటి ఒత్తిడిని పెట్టదలచుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా, ఆహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచులో కివీస్ 9 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.