ASIAN GAMES 2023 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా సమరం గురించి మీకు ఈ విషయాలు తెలుసా
ఆసియాలోనే అతిపెద్ద క్రీడా సంబురం వచ్చేసింది. చైనాలోని హాంగ్‌జౌ వేదికగా ఈ క్రీడలు శనివారం సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసియా క్రీడల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం 1. ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద క్రీడా సమరంగా ఆసియా క్రీడాలు పేరు గాంచాయి. ఇందులో భారతదేశంతో పాటు మరో 45 దేశాలు పాల్గొంటాయి. వాలీబాల్, ఫుట్ బాల్ ఇప్పటికే మొదలయ్యాయి. మరో విశేషం ఏంటంటే భారత్ క్రికెట్ లోనూ పోటీ పడనుంది. 2. హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో స్క్వాష్, బ్యాడ్మింటన్ , టెన్నిస్ సహా ఇతర ఆటలు ఈ నగరంతో పాటు మరో 5 నగరాల్లో ఎక్కువగా నిర్వహిస్తుంటారు.
తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్న చైనా, జపాన్
3. అన్ని సభ్యదేశాల నుంచి దాదాపుగా 11 వేల మంది క్రీడాకారులు, అథ్లెట్లు ఈ క్రీడాల్లో పాలుపంచుకోనున్నారు.1000కిపైగా మెడల్స్, పతకాలు, మోమెంటోస్ లాంటివి అందుబాటులో ఉంచుతారు. 4. భారత్ అథ్లెట్లు సుమారుగా 41 క్రీడా విభాగాల్లో పోటీపడనున్నారు. అత్యధికంగా అథ్లెట్ల జట్టులో 68 మంది క్రీడాకారులున్నారు. భారత్ టాప్ -5 : ఆసియా క్రీడాల్లో భారతదేశం ఐదో స్థానంలో కొనసాగుతోంది.తొలి స్థానంలో చైనా అధిపత్యం చెలాయిస్తుండగా, రెండో స్థానంలో జపాన్ దూసుకెళ్తోంది. చెరో మూడు వేలకు పైగా మెడల్స్ తో ఈ రెండు దేశాలు పరుగులు పెడుతున్నాయి. 1951లో దిల్లీలో తొలిసారిగా భారత్ ఆసియా క్రీడలకు అతిథ్యమిచ్చింది. ఇప్పటివరకు భారత్ 155 బంగారు పతకాలతో కలిపి మొత్తంగా 672 మెడల్స్ ను ఒడిసిపట్టింది.