
IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ ఆల్‌రౌండర్ టోర్నీకి దూరం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు మరొక పెద్ద షాక్ తగిలింది.
ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్టార్ పేసర్ కగిసో రబాడ జట్టుకు దూరమవగా, ఇప్పుడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా గాయంతో జట్టుకు దూరమయ్యాడు.
గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ శనివారం అధికారికంగా ప్రకటించింది.
ఇంతవరకు ఈ సీజన్‌లో ఫిలిప్స్ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేకపోయాడు. గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్స్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు.
పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డ అతడిని చికిత్స చేసి బయటకు తీసుకువెళ్లారు.
Details
అగ్రస్థానంలో గుజరాత్
గజ్జల్లో నొప్పి తీవ్రం కావడంతో ఐపీఎల్ 2025 నుంచి అతడు తప్పుకున్నాడు.
ఫిలిప్స్ జట్టుకు దూరం కావడం గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం త్వరగా ఫిలిప్స్ కోలుకోవాలని ఆశిస్తోంది.
గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించి, 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన 9 మ్యాచ్‌లలో మరో 4 విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్ చేరతారు.
టైటాన్స్ జోరు చూస్తే సునాయాసంగా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం కనిపిస్తోంది. సుదర్శన్, శుభ్‌మాన్ గిల్, జోస్ బట్లర్ ఈ సీజన్‌లో ఆకట్టుకుంటున్నారు,
అలాగే షారుక్ ఖాన్, రాహుల్ తేవాతియా కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు. బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ రాణిస్తున్నారు.