
Team India: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. నాల్లో టెస్టుకు ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. ఈ ఫలితంతో సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో ముందంజలోకి వెళ్లింది. ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నా, భారత్ జట్టుకు ముందున్న ప్రయాణం అంత ఈజీ కాదనిపిస్తోంది. అంతేకాకుండా ఈ సిరీస్‌లోని నాల్గో టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవడం గట్టి దెబ్బగా మారింది. రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరూ మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి ప్రారంభమయ్యే నాల్గో టెస్టుకు దూరమవుతున్నారని సమాచారం.
Details
పంత్ ఎడమచేతికి గాయం
మూడో టెస్టులో రిషబ్ పంత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడమచేతి చూపుడు వేలికి గాయం అయ్యింది. గాయం తలెత్తిన వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అనంతరం రెండు ఓవర్లు మాత్రమే కీపింగ్ చేసిన పంత్ తీవ్ర నొప్పితో మైదానాన్ని వీడిపోయాడు. తర్వాత ఫీల్డింగ్ సమయంలో మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించాడు. అయితే, పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు అనంతరం పంత్ గాయం విషయమై యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ స్పందించాడు. పంత్ స్కానింగ్ కోసం వెళ్తున్నాడని, గాయం పెద్దగా లేదని చెప్పాడు.
Details
బుమ్రా పరిస్థితిపై త్వరలోనే ఆప్డేట్ ఇస్తాం
నాల్గో టెస్టుకు అతను అందుబాటులో ఉంటాడనే ఆశ ఉన్నా, ఇంకా స్పష్టత రావాల్సి ఉందని గిల్ తెలిపాడు. ఇదిలా ఉంటే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా నాల్గో టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. బుమ్రా ఫిట్‌నెస్‌పై కూడా టీమ్ మేనేజ్‌మెంట్ త్వరలో అధికారిక సమాచారం ఇవ్వనుంది. గిల్ మాట్లాడుతూ.. బుమ్రా పరిస్థితిపై త్వరలోనే అప్‌డేట్ ఇస్తామని వెల్లడించాడు. ఇలాంటి పరిస్థితుల్లో, టీమిండియా నాల్గో టెస్టుకు పూర్తి స్థాయి సమీకృత బలంతో బరిలోకి దిగాలంటే పంత్, బుమ్రా లేని లోటును ఎలా భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.