
కోహ్లీ పుట్టిన రోజు నాడు బలమైన జట్టుతో మ్యాచ్.. శతకం బాదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ కప్ 2023 కోసం రోజుల దగ్గర పడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ ను నేడు ఐసీసీ ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఈ టోర్నీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రపంచ కప్ జరిగే సమయంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు రానుంది. ఆ రోజు దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ పోటీపడనుంది. ఇక 2011లో జరిగిన ప్రపంచ కప్‌లో టీమిండియా, దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది.
ఆ జట్టుతోనే నవంబర్ 5న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ కోహ్లీ బర్త్ డే నాడు టీమిండియా మ్యాచ్ ఆడనుంది. అయితే కోల్‌కతా పిచ్‌లో పరుగులు రాణించడానికి అనుకూలంగా ఉంటుంది.
Details
అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభం
ఈ నేపథ్యంలో రన్ మెషీన్ తన పుట్టిన రోజున సెంచరీ సాధించి, టీమిండియాను గెలిస్తాడని అభిమానులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు.
ఇక రోహిత్ శర్మ కూడా 2019 ప్రపంచ కప్ లో భారత్ తరుపున ఒకే సిరీస్‌లో ఐదు సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్ లో కూడా రోహిత్ శర్మ అలాంటి ఫీట్ సాధిస్తే ప్రపంచ కప్ సిరీస్ లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కనున్నాడు.
గతంలో ఈ రికార్డు సచిన్ టెండుల్కర్ పేరిట ఉంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మొత్తం 45 రోజుల పాటు వరల్డ్ కప్ సమరం కొనసాగనుంది.