Loading...
Ravindra Jadeja: మైండ్‌ బ్లోయింగ్‌ రికార్డ్‌.. కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌!
మైండ్‌ బ్లోయింగ్‌ రికార్డ్‌.. కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌!

Ravindra Jadeja: మైండ్‌ బ్లోయింగ్‌ రికార్డ్‌.. కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌లో స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఏకంగా 350 వికెట్లు పూర్తి చేసి ప్రత్యేక ఘనతను సాధించాడు. తన అద్భుతమైన స్పిన్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ, టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జడేజా.. ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో 350 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్‌ కుంబ్లే, రవిచంద్రన్‌ అశ్విన్‌, కపిల్‌ దేవ్‌, హర్భజన్‌ సింగ్‌ ఇప్పటికే ఉన్నారు. తాజాగా వారి సరసన జడేజా చేరాడు. జడేజా ప్రత్యేకత కేవలం బౌలింగ్‌కే పరిమితం కాదు.

వివరాలు

ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు వెన్నుదన్నుగా నిలిస్తున్న జడేజా

లోయర్‌ ఆర్డర్‌లో కీలకమైన బ్యాటింగ్‌తోనూ అతను ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 3,000పరుగులతో పాటు 350వికెట్ల మైలురాయిని అందుకున్న అరుదైన ఆల్‌రౌండర్లలో ఒకడిగా కూడా జడేజా గుర్తింపు పొందాడు. దీంతో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఉన్న ప్రత్యేక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు.

జడేజా సాధించిన ఈ అరుదైన ఘనతపై క్రికెట్‌ ప్రపంచం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు పలువురు క్రికెట్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా జడేజాకు అభినందనలు తెలిపారు.

అభిమానులు ముద్దుగా 'సర్‌ జడేజా' అని పిలుచుకునే ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌.. తన బౌలింగ్‌, బ్యాటింగ్‌తో భారత జట్టుకు ఎంతో బలంగా నిలుస్తున్నాడు.

ADVERTISEMENT