LOADING...
Team India: టీమిండియా గెలవాలని స్వీగ్గిలో కొబ్బరికాయలు ఆర్డర్.. తర్వాత ఏమైందంటే? 
టీమిండియా గెలవాలని స్వీగ్గిలో కొబ్బరికాయలు ఆర్డర్.. తర్వాత ఏమైందంటే?

Team India: టీమిండియా గెలవాలని స్వీగ్గిలో కొబ్బరికాయలు ఆర్డర్.. తర్వాత ఏమైందంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 20, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో టోర్నీలో వరుస విజయాలకు ఫైనల్‌కు చేరిన భారత జట్టు నిరాశే ఎదురైంది. విశ్వవిజేతగా నిలవాలన్న భారత ఆశలు ఆవిరయ్యాయి. భారత్ గెలుపు కోసం కొందరు అభిమానులు పూజలు చేయగా, మరికొందరు వారణాసిలో గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ క్రికెట్ అభిమాని మాత్రం భారత్ గెలిస్తే 51 కొబ్బరి కాయలు కొడతానని దేవుడ్ని మొక్కుకున్నాడు. ఈ కొబ్బరికాయలను అతను స్వీగ్గిలో ఆర్డర్ పెట్టాడు. మ్యాచుకు ముందే స్విగ్గీ దీనిపై స్పందించింది.

Details

ఆర్డర్ కు రిప్లై ఇచ్చిన స్వీగ్గి 

థానే నుంచి 51 కొబ్బరికాయలు ఆర్డర్ ఇచ్చారని, అదే గనుక నిజమైతే ఈసారి కచ్చితంగా భారత్‌కు ప్రపంచకప్ రావడం ఖాయమని స్విగ్గీ ట్వీట్ చేసింది. దీన్ని చూసిన థానే ఆ ఆర్డర్ చేసిన వ్యక్తిని తానేనని, టీమిండియా గెలిస్తే దేవుడికి కొబ్బరికాయలు కొడతానని టీవీలో మ్యాచును చూస్తున్న ఫోటోను పంచుకున్నాడు. ఇక టీమిండియా ఓడిపోవడంతో ఆ కొబ్బరికాయలను అతడు ఏం చేశాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే అతడు ఆ కొబ్బరి కాయలను ఏం చేశాడన్నది తెలియలేదు.