Tinselling Relationship: తెరపైకి మరో కొత్త రిలేషన్ షిప్.. హాలిడ్ డేటింగ్‌తో కొత్త దారులు!
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటింగ్ అనేది విస్తృతంగా పెరిగింది. ఇందులో భాగంగానే తెరపైకి కొత్త కొత్త రిలేషన్స్ పుట్టుకొస్తున్నాయి.
డేటింగ్ యాప్స్, వల్ ప్రపోజల్స్ దాటి నేటి యువత కొత్త దారులను వెతుక్కుంటోంది.
గతంలో సిట్యూయేషన్ షిప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు హాలిడే డేటింగ్‌ను తీసుకొచ్చింది. దీనినే టిన్సెల్లింగ్ (Tinselling) అని కూడా చెబుతారు.
అసలు టిన్సెల్లింగ్ అంటే ఏమిటి? ఈ కొత్త డేటింగ్ ట్రెండ్ ఏమి సూచిస్తుందో తెలుసుకుందాం.
టిన్సెల్లింగ్ అనే కొత్త డేటింగ్ ట్రెండ్.. ఎప్పుడూ ప్రేమ, ఆప్యాయత అనేది ప్రమాణికమైనది కాదని సూచిస్తుంది.
ఇందులో భాగంగా జంటలు తమ నిజమైన ఎమోషన్స్, రిలేషిప్ విషయాలను సెలవుల్లో వ్యక్తం చేయరు.
Details
వివాదాలు చెలరేగే అవకాశం ఉందన్న నిపుణులు
తమ రిలేషస్‌ని టిన్సెల్ చేస్తే న్యూ ఇయర్ వచ్చే వరకు, లేదంటే సమయం దొరికే వరకు రిలేషన్ గురించి ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో చర్చించరు.
అంటే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేంత వరకు తమ సమస్యలను చర్చించకుండా హ్యాపీగా న్యూ ఇయర్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు దీనిని ఎంచుకుంటున్నాని నిపుణులు చెబుతున్నారు.
ఒకరి ఫ్యామిలీ ప్రైవసీని మరొకరు గౌరవించకుంటూ హాలీడే డేటింగ్ చేస్తున్నారు.
టిన్సెల్లింగ్ రిలేషన్ షిప్లో ఎన్ని గొడవలు ఉన్నా మరిచిపోయి వారి వారి ఫ్యామిలీతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
మరోవైపు ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండడం ఇష్టంలేక వివాదాలు మరింత చెలరేగే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.