AUS vs IND: విరాట్ కోహ్లీని ఫోకస్ చేస్తూ పోస్టర్. ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ అభిమానులు
ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య నవంబర్ మూడో వారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు, ఆసీస్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో బరిలోకి దిగనుంది. అయితే ఆసీస్ మీడియా "ఫాక్స్ క్రికెట్" విడుదల చేసిన ఓ వీడియో, ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్ గ్రూప్ 'బార్మీ ఆర్మీ' చేసిన ఓ పోస్టుపై భారత అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో విరాట్ కోహ్లీని ప్రధానంగా హైలైట్ చేయడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు. బార్మీ ఆర్మీ చేసిన పోస్టులో కోహ్లీని ప్రముఖంగా చూపిస్తూ, అతను ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రస్తావించారు.
హిట్ మ్యాన్ ను పక్కన పెట్టడం సరికాదు
రోహిత్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఈ విధంగా విరాట్ కోహ్లీని ప్రస్తావించడంపై రోహిత్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ''విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ అయినా, రోహిత్‌ను పక్కనపెట్టడం సరైనది కాదంటూ భారత అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్, బార్మీ ఆర్మీ ఇలా గతంలో కూడా వివాదాస్పద పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. భారత్ ఈ సిరీస్‌లో హ్యాట్రిక్ విజయం సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండుసార్లు విరాట్ కోహ్లీ నాయకత్వంలో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా, ఈసారి రోహిత్ సారథ్యంలో అదే విజయాన్ని కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది.