Page Loader
హాకీ ప్లేయర్ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం
స్టేడియానికి రాణిస్ గర్ల్స్ హాకీ టర్ఫ్ గా నామకరణం

హాకీ ప్లేయర్ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2023
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా మహిళా హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ కు అరుదైన గౌరవం లభించింది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఓ స్టేడియానికి ఆమె పేరును నామకరణం చేశారు. ఈ స్టేడియం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఉంది. గతంలో ఈ స్టేడియానికి 'MCF రాయ్‌బరేలీ' అని పేరు ఉండగా.. ప్రస్తుతం దాన్ని 'రాణిస్ గర్ల్స్ హాకీ టర్ఫ్'గా మార్చారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ ప్రకటించింది. అక్కడ ఆమె దిగిన ఫోటోను, ఇతర సిబ్బందితో స్టేడియాన్ని ప్రారంభించిన ఫోటోను షేర్ చేసింది. తన పేరు మీద స్టేడియం ఉండడం నిజంగా గర్వకారణమని, దీనిని భారత మహిళల హాకీ జట్టుకు అంకితం చేస్తున్నానని రాణి రాంపాల్ పేర్కొంది.

రాణి రాంపాల్

చాలా గర్వంగా ఉంది : రాణి రాంపాల్

"హాకీకి తాను చేసిన సేవలను గుర్తించి MCF రాయ్‌బరేలీ హాకీ స్టేడియం పేరును "రాణిస్ గర్ల్స్ హాకీ టర్ఫ్‌గా మార్చినందుకు చాలా గర్వంగా ఉందని, తన సంతోషాన్ని పంచుకునేందుకు మాటలు చాలడం లేదని రాణి తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది. ఎఫ్‌ఐహెచ్ ఉమెన్స్ హాకీ ప్రో లీగ్ 2021-22లో బెల్జియంతో చివరిసారి ఆడిన తర్వాత రాణి తిరిగి జట్టులోకి వచ్చింది. 28 ఏళ్ల రాణి రాంపాల్ టోక్యో ఒలింపిక్స్ నుండి గాయంతో బాధపడుతోంది. దీంతో ఆమె ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్ 2022 స్క్వాడ్‌ల నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.