వరల్డ్ కప్ ముందు భారత జట్టుకు షాక్.. స్టార్ క్రికెటర్‌కు డెంగ్యూ
వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభమవుతున్న సమయంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఎల్లుండి ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉండటంతో అతడు కోలుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల భారత తరుపున వన్డేల్లో అద్భుతంగా ఆడిన గిల్ కోలుకోకపోతే భారత బ్యాటింగ్ ఆర్డర్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. చైన్నైకి వచ్చినప్పటి నుంచి శుభ్‌మన్ గిల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అతనికి శుక్రవారం కూడా పరీక్షలు చేశామని, అయితే మొదటి మ్యాచు గిల్ ఆడకపోవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నారు.
గిల్ స్థానంలో ఓపెనర్ గా ఇషాన్ కిషన్!
జ్వరంగా కారణంగా శుభ్ మన్ గిల్ ఆస్ట్రేలియా మ్యాచుకు దూరమైతే అతని స్థానంలో ఓపెనర్ గా ఇషాన్ కిషాన్ బరిలోకి దిగుతారని PTI వర్గాలు వెల్లడించాయి. వన్డే వరల్డ్ కప్ ముందు గిల్ డెంగ్యూ భారీన పడటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.