
MI vs GT : చివరి వరకు ఉత్కంఠ పోరు.. గుజరాత్ చేతిలో ముంబయి ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది.
వర్షం ఆటలో అంతరాయం కలిగించడంతో డక్‌వర్డ్-లూయిస్ నియమాల ప్రకారం మ్యాచ్‌ను 19 ఓవర్లకు పరిమితం చేసి గుజరాత్‌కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్ధారించారు.
ఈ టార్గెట్‌ను గుజరాత్ చివరి బంతికి చేధించింది. ఆఖరి ఆరు బంతుల్లో ఒక వికెట్ కోల్పోయినా, 15 పరుగులు చేసి విజయం సాధించింది.
గిల్ 43, బట్లర్ 30, రూథర్‌ఫోర్డ్ 28 పరుగులతో రాణించారు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
వారి ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్విని కుమార్ తలో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మూడు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు
And we all can breathe now 😅@gujarat_titans seal the match in Mumbai 📍
— IndianPremierLeague (@IPL) May 6, 2025
They win by 3⃣ wickets
Updates ▶ https://t.co/DdKG6Zn78k#TATAIPL | #MIvGT pic.twitter.com/LeTpErlxHd