దేవధర్ ట్రోఫీలో దుమ్ములేపుతున్న బెంగాల్ ఓపెనర్
దేవధర్ ట్రోఫీలో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ దుమ్ములేపుతున్నాడు. ఈస్ట్ జోన్ తరుపున అభిమన్యు ఈశ్వరన్(100) సెంచరీ చేసి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్ ఎ క్రికెట్లో 3500 పరుగుల మార్కును అతను చేరుకున్నాడు. బుధవారం జరిగిన ఈస్ట్ జోన్ తరుపున 102 బంతుల్లో (13ఫోర్లు) 100 పరుగులతో అభిమన్యు ఈశ్వర్ చెలరేగారు. దీంతో నార్త్ ఈస్ట్ జోన్ పై ఈస్ట్ జోన్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్ 169 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య చేధనకు దిగిన ఈస్ట్ జోన్ 31.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది.
లిస్ట్ ఎ క్రికెట్లో ఎనిమిది సెంచరీలు సాధించిన అభిమన్యు ఈశ్వరన్
మ్యాచ్ విషయానికొస్తే.. ఈశ్వరన్ ఉత్కర్ష్ సింగ్ (29)తో కలిసి మొదటి వికెట్‌కు అభిమన్యు ఈశ్వరన్ 93 పరుగులు జోడించారు. రియాన్ పరాగ్(13) నిరాశపరిచాడు. అయితే ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి అభిమాన్యు ఈశ్వర్ చక్కగా పరుగులు రాబట్టాడు. చివర్లో విరాట్ సింగ్(17) ఫర్వాలేదనింపిచాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఈశ్వరన్ (38) రెండో మ్యాచులో శతకంతో విజృంభించాడు. ఇప్పటివరకూ లిస్ట్ ఎ క్రికెట్లో 47.48 సగటుతో 3,514 పరుగులు సాధించాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలు, ఎనిమిది సెంచరీలను బాదాడు.