దేవధర్ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ జట్లు
దేవధర్ ట్రోపీ 2023లో భాగంగా సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తుతున్నాయి. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆ జట్లు విజయాలు సాధించాయి. మరోవైపు వెస్ట్ జోన్, నార్త్ జోన్ ఆడిన రెండు మ్యాచుల్లో చెరో విజయాన్ని నమోదు చేశాయి. రెండో రోజు వెస్ట్ జోన్ పై సౌత్ జోన్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే విధంగా నార్త్ జోన్ పై ఈస్ట్ జోన్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది. సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 98 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 46.4 ఓవర్లలో 206 పరుగులు చేసింది. వెస్ట్ జోన్ బౌలర్ పార్థ్ భుట్ మూడు వికెట్లతో చెలరేగాడు.
సెంచరీతో చెలరేగిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్
లక్ష్య చేధనకు దిగిన వెస్ట్ జోన్ 36.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సౌత్ జోన్ బౌలర్ రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ 3 వికెట్లతో రాణించగా.. డబ్ల్యూజోన్ తరఫున సర్ఫరాజ్ ఖాన్ 42 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మయాంక్ అగర్వాల్ లిస్ట్ ఏ క్రికెట్లో 4,458 పరుగులకు చేరుకున్నాడు. ప్రస్తుతం అతని సగటు 45కి పైగా ఉంది. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 107 బంతుల్లో 121 పరుగులు చేశాడు. కెప్టెన్ నితీశ్ రాణా 51 పరుగులతో రాణించారు.
హాఫ్ సెంచరీలతో రాణించిన శివమ్ చౌదరి, యష్ దూబే, ఉపేంద్ర యాదవ్
శివమ్ చౌదరి, యష్ దూబే, ఉపేంద్ర యాదవ్‌లు అర్ధశతకాలతో ఫర్వాలేదనిపించారు. లక్ష్య చేధనకు దిగిన సెంట్రల్ జోన్ 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. రానా 4 వికెట్లతో ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. లిస్ట్ ఏ క్రికెట్లో రాణా 38.69 సగటుతో 2,128 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలను బాదాడు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో 46 వికెట్లను పడగొట్టాడు. లిస్ట్ A క్రికెట్‌లో ఈశ్వరన్ 47.48 సగటుతో 3,514 పరుగులు సాధించాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలను బాదాడు.