Page Loader
Deodhar Trophy 2023: మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన

Deodhar Trophy 2023: మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2023
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేవధర్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు. బుధవారం వెస్ట్ జోన్‌తో జరిగిన రెండో మ్యాచులో మయాంక్ అగర్వాల్ 115 బంతుల్లో 9 ఫోర్లతో 98 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో సౌత్ జోన్ జట్టు 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 75 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్, అరణ్ కార్తీక్ 50 పరుగులు జోడించడంతో సౌత్ జోన్ 200 పరుగుల మార్కును దాటింది. మయాంక్‌కి లిస్ట్ ఎ క్రికెట్‌లో ఇప్పటివరకూ 20 హాఫ్ సెంచరీలను బాదాడు.

Details

వెస్ట్ జోన్ పై సౌత్ జోన్ విజయం

లిస్ట్ ఎ క్రికెట్‌లో మయాంక్ అగర్వాల్ 45 సగటుతో 4,458 పరుగులను సాధించాడు. దేవధర్ ట్రోఫీ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా మయాంక్ అగర్వాల్ నిలిచాడు. సెమీ-ఫైనల్స్‌లో ఎన్‌జోన్‌పై మయాంక్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు బాదడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. 206 పరుగుల లక్ష్య చేధనకు దిగిన వెస్ట్ జోన్ 194 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌత్ జోన్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.