Page Loader
Deodhar Trophy 2023: చెలరేగిన ప్రియాంక్ పంచల్.. వెస్ట్ జోన్ విజయం
చెలరేగిన ప్రియాంక్ పంచల్.. వెస్ట్ జోన్ విజయం

Deodhar Trophy 2023: చెలరేగిన ప్రియాంక్ పంచల్.. వెస్ట్ జోన్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2023
07:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేవదర్ ట్రోఫీ 2023లో భాగంగా నార్త్ ఈస్ట్ పై వెస్ట్ జోన్ గెలుపొందింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పంచల్ 99* పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఒక్క పరుగు దూరంలో అతను సెంచరీ మిస్ అయ్యాడు. కేవలం 69 బంతుల్లో ( ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు) 99 పరుగులతో ప్రియాంక్ పంచల్ విజృంభించాడు. లిస్ట్ క్రికెట్‌లో ప్రియాంక్ పంచల్ కి ఇది 20వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అతని పాటు మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ 85 పరుగులతో రాణించాడు. ఇక రాహుల్ త్రిపాఠి 13 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Details

అద్భుతమైన ఫామ్ లో ప్రియాంక్ పంచల్

పంచల్ 87 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో 3,378 పరుగులను సాధించాడు. ఇందులో ఏడు సెంచరీలు, 20 అర్ధ సెంచరీలను బాదాడు. గత సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీలో పాంచల్ ఏడు మ్యాచ్‌ల్లో 354 పరుగులు చేశాడు. పంచల్ దులీప్ ట్రోఫీ నుండి దేవధర్ ట్రోఫీ వరకు అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. సౌత్ జోన్‌తో జరిగిన 2023 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో 95 పరుగులతో సత్తా చాటిన విషయం తెలిసిందే. మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ ఈస్ట్ 207 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన వెస్ట్ జోన్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 208 పరుగుల చేసి విజయం సాధించింది.