Page Loader
IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్.. 
టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..

IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
08:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో మైదానంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా ఆట ప్రారంభించినా, ఓపెనర్లు రెండు వికెట్లను త్వరగా కోల్పోయారు. టీమ్‌కు శుభారంభం ఇచ్చిన అభిషేక్ శర్మ (34)ను ఎంగిడి బౌలింగ్‌లో అవుట్ చేయగా, తక్కువ వ్యవధిలోనే మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (17) కూడా వెనుదిరిగాడు. అతను భువనేశ్వర్ వేసిన ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, రొమారియో షెపర్డ్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓవర్‌ఆల్‌గా 54 పరుగుల వద్దే రెండు కీలక వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టును ప్రస్తుతం ఇషాన్ కిషన్ (9 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (8 నాటౌట్)లు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 6 ఓవర్ల ముగిసేసరికి, హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు సాధించింది.

వివరాలు 

పగిలిన స్టాండ్స్‌లో ఉన్న టాటా కర్వ్ కారు అద్దం

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. కోవిడ్ నుంచి కోలుకుని తిరిగి వచ్చిన ట్రావిస్ హెడ్, యశ్ దయాల్ వేసిన తొలి ఓవర్‌లోనే బౌండరీతో తన ప్రతాపాన్ని చూపించాడు. అనంతరం, అభిషేక్ శర్మ భువనేశ్వర్ బౌలింగ్‌కి ధీటుగా ఎదుర్కొని, తనదైన శైలిలో విజృంభించాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మొత్తం 18 పరుగులు చేసిన అతడు, ఒక బలమైన షాట్‌తో బంతిని స్టాండ్స్‌లో ఉన్న టాటా కర్వ్ కారుకు కొట్టాడు. ఫలితంగా కారు అద్దం పగిలిపోయింది.

వివరాలు 

టీ20ల్లో 4,000 పరుగుల మైలురాయిని చేసిన అభిషేక్ శర్మ 

తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. 3.3 ఓవర్లకే జట్టు స్కోర్ 50 దాటింది. వెంటనే మరో ఫోర్ కొట్టి, టీ20ల్లో తన 4,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కానీ, లెగ్‌సైడ్ దిశగా భారీ షాట్‌కి ప్రయత్నించిన అతడు, ఫిల్ సాల్ట్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఫలితంగా 54 పరుగుల వద్ద సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సన్‌ రైజర్స్ ఆరంజ్ ఆర్మీ చేసిన ట్వీట్ 

వివరాలు 

టీ20లో అత్య‌ధిక స్ట్ర‌యిక్ రేటు 

టీ20 క్రికెట్‌లో నాలుగు వేల ప‌రుగులు పూర్తిచేసిన వారిలో అత్య‌ధిక స్ట్ర‌యిక్ రేటు సాధించిన ఆట‌గాడిగా అభిషేక్ శ‌ర్మ కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఈ యువ ఓపెన‌ర్ 166.05 స్ట్ర‌యిక్ రేటుతో మొత్తం 4,002 ర‌న్లు సాధించాడు.ఈ అద్భుత ప్రదర్శనతో అతను అంత‌ర్జాతీయంగా ఈ ఘ‌న‌త సాధించిన మూడో ఆట‌గాడిగా నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన ఫిన్ అలెన్ ప్రథ‌మ స్థానంలో ఉన్నాడు.అతను 170.93 స్ట్ర‌యిక్ రేటుతో 4,000 ర‌న్లు పూర్తి చేశాడు.

వివరాలు 

టీ20లో అత్య‌ధిక స్ట్ర‌యిక్ రేటు 

రెండో స్థానంలో వెస్టిండీస్‌కు చెందిన విధ్వంస‌కర ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ర‌స్సెల్ ఉన్నాడు.ర‌స్సెల్ 168.84 స్ట్ర‌యిక్ రేటుతో 9,175 ర‌న్లు కొట్టాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా క్రికెట‌ర్ టిమ్ డేవిడ్,న్యూజిలాండ్ ఆట‌గాడు డీ గ్రాండ్‌హొమ్‌లు ఉన్నారు. వీరిద్దరూ కూడా గొప్ప స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్‌చేసే విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మ‌న్లుగా గుర్తింపు పొందారు.