Page Loader
IND vs ENG: అభిషేక్‌ శర్మకు గాయం? నూతన ఓపెనర్‌ కోసం భారత జట్టు అన్వేషణ!
అభిషేక్‌ శర్మ గాయం? నూతన ఓపెనర్‌ కోసం భారత జట్టు అన్వేషణ!

IND vs ENG: అభిషేక్‌ శర్మకు గాయం? నూతన ఓపెనర్‌ కోసం భారత జట్టు అన్వేషణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ ఇవాళ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా, సిరీస్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని భావిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో బలంగా ఉన్న భారత్‌కు తుది జట్టు ఎంపిక కాస్త క్లిష్టంగా మారింది. ముఖ్యంగా పేసర్‌ షమీని ఆడిస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. అయితే తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన అభిషేక్‌ శర్మ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్ సమయంలో అతడు చీలమండ గాయంతో బాధపడినట్లు సమాచారం అందింది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అభిషేక్‌ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైతే, ఓపెనర్‌గా ఎవరు రావాలనే ప్రశ్న ఏర్పడింది.

Details

సూర్యకుమార్ ఓపెనర్ గా వచ్చే అవకాశం

సంజు శాంసన్‌, అభిషేక్‌ కి బ్యాకప్‌ ఓపెనర్‌ లేకపోవడం గమనార్హం. కాబట్టి, సూర్యకుమార్‌ ఓపెనర్‌గా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. షమీకు సంబంధించి, రెండో టీ20లో అతడి ఆడే అవకాశం పెరిగింది. మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన నితీశ్‌ రెడ్డి బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండిట్లోనూ పాల్గొనలేదు. అతడి స్థానంలో షమీని ఆడించవచ్చని సమాచారం ఉంది. మరోవైపు చెపాక్ స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే నితీశ్‌ను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇంకా, అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండో టీ20ల్లో మూడు వికెట్లు తీస్తే.. అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనున్నారు.