LOADING...
Abhishek sharma: విమర్శలు వస్తే కుంగిపోవద్దు: యువ ఓపెనర్ అభిషేక్ శర్మ
విమర్శలు వస్తే కుంగిపోవద్దు: యువ ఓపెనర్ అభిషేక్ శర్మ

Abhishek sharma: విమర్శలు వస్తే కుంగిపోవద్దు: యువ ఓపెనర్ అభిషేక్ శర్మ

వ్రాసిన వారు Moogati Shabari
Mar 16, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ క్రికెట్ సమయంలో వరుసగా డకౌట్‌లకు గురైనప్పుడు తాను తీవ్రంగా నిరుత్సాహానికి లోనయ్యానని యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వెల్లడించాడు. ఆ కఠిన సమయంలో జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ తనకు ధైర్యం చెప్పారన్నారు. అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ప్రారంభంలో విమర్శలు ఎదుర్కొన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుందన్నారు. కాలక్రమంలో అలాంటి పరిస్థితులకు అలవాటు పడిపోతామని, భారతదేశంలో ఇది సాధారణ విషయమేనని అన్నారు. టీ20 ప్రపంచకప్‌లో వరుసగా డకౌట్‌లకు గురైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, అలాగే హార్దిక్ పాండ్య తన వద్దకు వచ్చి.. ఫోన్ తీసుకుని వెంటనే సోషల్ మీడియా యాప్‌లను తొలగించమని చెప్పారన్నారు.

వివరాలు

హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి..

సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు తనపై ప్రభావం చూపకుండా ఉండాలనే ఉద్దేశంతో వారు అలా చేయించారన్నారు. కొన్ని సార్లు మాత్రం ఆశించిన విధంగా ఆడలేమని, అది ప్రతి క్రికెటర్ జీవితంలో సహజమైన విషయమేనని అభిషేక్ శర్మ తెలిపారు. టీ20 ప్రపంచకప్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన అభిషేక్ శర్మ ప్రారంభంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. అయితే తరువాత సూపర్-8 దశలో జింబాబ్వే జట్టుపై అర్ధశతకం నమోదు చేశాడు. అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా మరో అర్ధశతకం సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు.

Advertisement