Page Loader
SRH vs PBKS : అభిషేక్ శర్మ సంచలన సెంచరీ.. భారీ టార్గెట్‌ను చేధించిన ఎస్ఆర్‌హెచ్!
అభిషేక్ శర్మ సంచలన సెంచరీ.. భారీ టార్గెట్‌ను చేధించిన ఎస్ఆర్‌హెచ్!

SRH vs PBKS : అభిషేక్ శర్మ సంచలన సెంచరీ.. భారీ టార్గెట్‌ను చేధించిన ఎస్ఆర్‌హెచ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2025
11:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ కింగ్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. భారీ లక్ష్యం ముందు ఉన్నా అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 245 పరుగుల ఛేదనను కేవలం 18.3 ఓవర్లలోనే పూర్తి చేసి సునాయాస విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో భారీ స్కోర్ నమోదు చేయగలిగారు. ప్రియాన్స్ ఆర్యా 36 పరుగులు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 42 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి 82 పరుగులు చేశాడు. నేహాల్ వధేరా కూడా 27 పరుగులతో తన వంతు పాత్ర పోషించాడు.

Details

అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్

మొత్తంగా పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోర్ అందించింది. బౌలింగ్ విభాగంలో ఎస్ఆర్‌హెచ్ జట్టుకు హర్షల్ పటేల్ నలుగు వికెట్లు తీయడంతో మెరుగైన ప్రారంభం లభించింది. ఎషాన్ మలింగ కూడా రెండు వికెట్లు తీసి జట్టుకు మద్దతుగా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ బ్యాటర్లు పూర్తిగా ఆధిపత్యం చాటారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 66 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి కేవలం 141 పరుగులతో మ్యాచ్‌ను తన వైపు తిప్పేశాడు. క్లాసేన్ 21 పరుగులతో విజయం దిశగా తోడ్పాటునిచ్చాడు. 245 పరుగుల టార్గెట్‌ను కేవలం 18.3 ఓవర్లలో పూర్తి చేసి ఎస్ఆర్‌హెచ్ ఓ రికార్డు విజయాన్ని నమోదు చేసింది.

Details

తేలిపోయిన పంజాబ్ బౌలర్లు

పంజాబ్ బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్‌ తీసినా, హైదరాబాద్ దూకుడు ఆపలేకపోయారు. వరుసగా విజయాల మీదున్న పంజాబ్‌కు ఇది ఓ తీవ్ర ఝలక్‌గా మారగా, హైదరాబాద్ ఈ సీజన్‌లో తమ రెండో విజయం నమోదు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 పంజాబ్ పై హైదరాబాద్ గెలుపు