సచిన్ చూసి ధోని, కోహ్లీ నేర్చుకోవాలి.. వారిద్దరికి డబ్బే ముఖ్యమా..?
కొందరు సెలబ్రిటీలు ఏ యాడ్ లో పడితే ఆ యాడ్ లో దర్శనం ఇస్తుంటారు. ముఖ్యంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అల్కహాల్ ప్రమోషన్లలో సెలబ్రిటీలు చేస్తున్నారు. ఏదైనా ప్రొడెక్టును సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తే దానికి విపరీతమైన డిమాండ్ మార్కెట్లో ఏర్పడుతుంది. అయితే అవి జనాలకు మంచిదా చెడుదా అన్న కనీస బాధ్యత సెలబ్రిటీలకు లేకుండా పోయింది. ఇంకా రమ్మీ, బెట్టింగ్ లాంటి వాటికి కూడా ప్రమోట్ చేస్తుంటారు. క్రికెట్ ప్రపంచంలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ నటిస్తున్న యాడ్ ల విషయంలో ఏమాత్రం బాధ్యతలేనట్లు ప్రవర్తిస్తున్నట్లు అర్ధమవుతోంది. వాస్తవానికి లిక్కర్, బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంతో ఈ ఇద్దరూ అందరికంటే ముందు స్థానంలో ఉన్నారు.
నిబంధనల ఉల్లంఘనలో ధోని, కోహ్లీ టాప్
సెలబ్రిటీలపై ఫిర్యాదులు పెరిగిపోయాయని అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా గతేడాదితో పోల్చితే ఏకంగా 803 శాతం ఫిర్యాదులు పెరిగిపోయాయని ధ్రువీకరించింది. గతేడాది 55గా ఉన్న ఫిర్యాదులు సంఖ్య ఈ ఏడాది 503 కు చేరుకోవడం గమనార్హం. డ్యూ డిలిజన్స్ ఉల్లంఘనలో విరాట్ కోహ్లీ, నటి శద్ధ్రా కపూర్ కూడా ఉండడం విశేషం. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వీరంతా ప్రొడెక్టులను ప్రమోట్ చేస్తున్నట్లు తేలింది. మద్యం, సిగరెట్ ప్రకటనలను తిరస్కరించిన సచిన్ ను చూసి ధోని, కోహ్లీ నేర్చుకోవాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.