తదుపరి వార్తా కథనం
ENG vs AFG : ఉత్కంఠ పోరులో అప్ఘాన్ గెలుపు.. ఇంగ్లండ్ ఇంటికి!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 26, 2025
10:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో అప్ఘనిస్తాన్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
326 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 317 పరుగులకే ఆలౌటైంది.
చివర్లో అప్ఘాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు ఒత్తిడిలోకి వెళ్లింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో రూట్ (120) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
Details
177 పరుగులతో రాణించిన ఇబ్రహీం జద్రాన్
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆప్గాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.
ఆ జట్టు బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ (177) పరుగులతో చెలరేగాడు.
ఆప్ఘాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ 5 వికెట్లతో చెలరేగి, ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.