LOADING...
AUS vs AFG: అప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు చేరిన ఆసీస్
అప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు చేరిన ఆసీస్

AUS vs AFG: అప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు చేరిన ఆసీస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
09:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 గ్రూప్‌-బిలో భాగంగా ఇవాళ జరిగిన కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగలడంతో మ్యాచును అంపైర్లు రద్దు చేశారు. మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుకుంది. 274 పరుగుల లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో 109 పరుగులు చేసింది.ట్రవిస్‌ హెడ్‌ (59), స్టీవ్‌ స్మిత్‌ (19) క్రీజ్‌లో ఉండగా వర్షం ఆటకం కలిగింది. ఈ క్రమంలో మ్యచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఇరు జట్లకు చేరో పాయింట్ లభించింది. ఇక ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో సెమీస్ కు చేరుకుంది.

Details

మూడు వికెట్లు పడగొట్టిన బెన్‌ డ్వార్షుయిష్‌

ఈ మ్యాచ్‌లో తొలుత ఆప్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సెదిఖుల్లా అటల్‌ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (63 బంతుల్లో​ 67; ఫోర్‌, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్భాజ్‌ (0), మహ్మద్‌ నబీ (1), గుల్బదిన్‌ నైబ్‌ (4), నూర్‌ అహ్మద్‌ (6) నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్‌ డ్వార్షుయిష్‌ 3, స్పెన్సర్‌ జాన్సన్‌, ఆడమ్‌ జంపా తలో 2, ఎల్లిస్‌, మ్యాక్స్‌వెల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.