
టీ20ల్లో ఆప్ఘనిస్తాన్ ప్లేయర్ అద్భుత ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్తాన్ తొలి అంతర్జాతీయ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20ల్లో పాక్‌పై ఆప్ఘనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండానే అప్ఘన్ సిరీస్‌ను సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్ ప్లేయర్ రహ్మానుల్లా గుర్బాజ్ 49 బంతుల్లో 44 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్) చేసి అఫ్ఘానిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో అరుదైన ఘనతను సాధించాడు. టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రెహ్మానుల్లా గుర్బాజ్ నిలిచాడు.
షార్జా క్రికెట్ స్టేడియంలో 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.
రెహ్మానుల్లా గుర్బాజ్
రెహ్మానుల్లా గుర్బాజ్ సాధించిన రికార్డులివే
గుర్బాజ్ ఇప్పటివరకూ 40 టీ20 మ్యాచ్‌లు ఆడి 1,000 పరుగుల మార్క్‌ను దాటాడు. అతను మహ్మద్ షాజాద్ (2,015), మహ్మద్ నబీ (1,738), నజీబుల్లా జద్రాన్ (1,684), అస్గర్ ఆఫ్ఘన్ (1,382), సమీవుల్లా షిన్వారీ (1,013) కంటే ముందు స్థానంలో నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఆరో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా గుర్బాజ్ నిలిచాడు.
టీ20ల్లో గుర్బాజ్ ఐదు అర్ధ సెంచరీలు చేశారు. అత్యధికంగా టీ20ల్లో 87 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌తో జరిగిన ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ఆఫ్ఘనిస్తాన్ గెలవలేదు.
ఇక నామమాత్రపు మూడో టీ20 షార్జా వేదికగా సోమవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేయాలని ఆప్ఘన్ పట్టుదలతో ఉంది.