
Rashid Khan: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ ఔట్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాతో జరగనున్న సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకుండానే బరిలోకి దిగనుంది.
రషీద్ ఖాన్ గత ఏడాది నవంబర్‌లో వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్న రషీద్ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు.
రషీద్ ఖాన్ గాయపడినప్పటికీ, జట్టుమాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ముజీబ్ జద్రాన్, నవీన్-ఉల్ హక్,ఫజల్హక్ ఫరూఖీ వంటి ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.
ఈ సందర్భంగా జద్రాన్ మాట్లాడుతూ.. భారత్ తో జరిగే T20 సిరీస్ కు రషీద్ దూరమయ్యాడని చెప్పాడు.
భారత పిచ్‌లపై అనుభవం ఉన్న రషీద్ లేకపోవడంతో అఫ్గాన్ కు పెద్ద దెబ్బ అన్న అయన స్పిన్ దళాన్ని ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్‌లు నడిపించనున్నారని తెలిపాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ ఔట్
Rashid Khan ruled out of the T20I series vs India. [Sportstar]#INDvsAFG pic.twitter.com/e11l1XOXoA
— Don Cricket 🏏 (@doncricket_) January 10, 2024