NZ Vs AFG : బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్‌నిస్తాన్.. మరోసారి సంచలనం సృష్టిస్తుందా!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చైన్నైలోని చిదంబరం స్టేడియంలో మరో అసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరగనున్న 16వ మ్యాచులో న్యూజిలాండ్, ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆఫ్గాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆఫ్గానిస్తాన్ ఫుల్ జోష్‌తో బరిలోకి దిగుతోంది. మరోవైపు 3 మ్యాచులాడిన కివీస్ మూడింటిలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఫుల్ ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్‌ను అఫ్గానిస్తాన్ ఏ మేరకు కట్టడి చేస్తుందో వేచి చూడాలి. ఇక కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ మ్యాచుకు దూరమయ్యాడు. అతని స్థానంలో విల్ యంగ్ జట్టులోకి వచ్చాడు.
ఇరు జట్లలోని సభ్యులు వీరే
ఆఫ్ఘనిస్తాన్ జట్టు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(w), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హా న్యూజిలాండ్ జట్టు డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్