Praggnanandhaa: ప్రపంచ ఛాంపియన్ ను ఓడించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథ్ ఆనంద్ ను దాటి..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (R Praggnanandha)చరిత్ర సృష్టించాడు.
మంగళవారం జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ ను ఓడించి ఈ ఘనత అందుకున్నాడు.
ప్రజ్ఞానంద ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌లో 2748.3 పాయింట్లతో 11వస్థానంలో ఉన్నాడు.
ఆ తరువాతి స్థానంలో విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12స్థానంలో కొనసాగుతున్నాడు.
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత.. క్లాసికల్ చెస్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద నిలిచాడు.
భారత నంబర్ వన్ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద అవతరించడంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రశంసలు కురిపించారు.
అంతకముందు ఏడాది జరిగిన చెస్ ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద కొద్దిలో టైటిల్ కోల్పోయాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డింగ్ లిరెన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
For the first time in his career, @rpraggnachess took the number-one spot among Indian players in the live ratings after defeating World Champion Ding Liren on Tuesday at #TataSteelChess.https://t.co/xG6gMbPPe8
— chess24.com (@chess24com) January 16, 2024