LOADING...
Vaibhav Sooryavanshi: కొత్త టోర్నీకి సిద్ధమైన యువ సంచలనం..వైభవ్ తదుపరి మ్యాచ్‌లు ఇవే
కొత్త టోర్నీకి సిద్ధమైన యువ సంచలనం..వైభవ్ తదుపరి మ్యాచ్‌లు ఇవే

Vaibhav Sooryavanshi: కొత్త టోర్నీకి సిద్ధమైన యువ సంచలనం..వైభవ్ తదుపరి మ్యాచ్‌లు ఇవే

వ్రాసిన వారు Moogati Shabari
May 30, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఈ టోర్నీ ప్రయాణం ముగిసింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలవడంతో జట్టు పోటీ నుంచి నిష్క్రమించినప్పటికీ, వైభవ్ తన అసాధారణ ప్రదర్శనతో భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ ఆశలు రేకెత్తించాడు. ఇప్పుడు అతని తదుపరి సవాల్ ఏమిటన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

వివరాలు

మరో కీలక టోర్నీలోకి వైభవ్..

త్వరలోనే వైభవ్ భారత జెర్సీలో మరో కీలక టోర్నీలో పాల్గొననున్నాడు. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జూన్ నెలలో నిర్వహించనున్న త్రైపాక్షిక వన్డే సిరీస్ కోసం అతడిని ఇండియా 'ఏ' జట్టులో ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో ఇండియా 'ఏ', శ్రీలంక 'ఏ', ఆఫ్ఘనిస్తాన్ 'ఏ' జట్లు తలపడనున్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ పోటీ యువ క్రికెటర్లకు తమ ప్రతిభను చాటుకునే మంచి వేదికగా భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇండియా 'ఏ' జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహించనుండగా, రియాన్ పరాగ్ ఉప కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

వివరాలు

త్రైపాక్షిక సిరీస్ షెడ్యూల్ ఇదే..

జూన్ 9న శ్రీలంక 'ఏ'తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 11న ఆఫ్ఘనిస్తాన్ 'ఏ'తో తలపడుతుంది. అనంతరం జూన్ 15న మళ్లీ శ్రీలంక 'ఏ', జూన్ 17న ఆఫ్ఘనిస్తాన్ 'ఏ'తో మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీ ఫైనల్ పోరు జూన్ 21న నిర్వహించనున్నారు. జూన్ 9: ఇండియా 'ఏ' vs శ్రీలంక 'ఏ' జూన్ 11: ఇండియా 'ఏ' vs ఆఫ్ఘనిస్తాన్ 'ఏ' జూన్ 13: ఆఫ్ఘనిస్తాన్ 'ఏ' vs శ్రీలంక 'ఏ' జూన్ 15: ఇండియా 'ఏ' vs శ్రీలంక 'ఏ' జూన్ 17: ఇండియా 'ఏ' vs ఆఫ్ఘనిస్తాన్ 'ఏ' జూన్ 19: ఆఫ్ఘనిస్తాన్ 'ఏ' vs శ్రీలంక 'ఏ' జూన్ 21: ఫైనల్

Advertisement