Page Loader
ముంబై విజయం తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లో వచ్చిన మార్పులివే!
పర్పుల్ క్యాప్ లీడ్ లో మహ్మద్ షమీ

ముంబై విజయం తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లో వచ్చిన మార్పులివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2023
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ముగింపు దశకు చేరుకుంది. ఇక రెండో క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లో స్వల్ప మార్పలు చోటు చేసుకున్నాయి. ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులు ఆలౌటైంది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో గెలుపొంది, రెండో క్వాలిఫయర్‌లో అడుగుపెట్టింది. అంతకుముందు తొలి క్వాలిఫయర్ లో చైన్నైపై ఓడిన గుజరాత్ రెండో క్వాలిఫయర్ ఆడేందుకు సిద్ధమైంది.

Details

అగ్రస్థానంలో డుప్లెసిస్

ఇక పర్పుల్ క్యాప్ విషయానికొస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ డుప్లెసిస్ 14 ఇన్నింగ్స్ లో 730 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. గుజరాత్ స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 722 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ 639, యశస్వీ జైస్వాల్ 625, డెవెన్ కాన్వే 625 పరుగులతో తర్వాతి స్థానంలో నిలిచారు. పర్పుల్ క్యాప్ రేసులో 15 ఇన్నింగ్స్ లో 26 వికెట్లు పడగొట్టి మహ్మద్ షమీ మొదటి స్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ 15 ఇన్నింగ్స్ లో 25 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పీయూష్ చావ్లా, యుజేంద్ర చాహల్, తుషార్ దేశ్ పాండే 21 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు.