స్వీట్ మ్యాంగోస్‌తో నవీన్ ఉల్ హక్‌ను ట్రోల్ చేసిన ముంబై ప్లేయర్స్.. ఏం చేశారంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆటతో కంటే తన దూకుడు ప్రవర్తనతో లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్ వార్తలలో నిలిచాడు. అతను మే 1న విరాట్ కోహ్లీతో వాగ్వాదం తర్వాత అతనిపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించడంతో ఇంస్టాగ్రామ్ ద్వారా కోహ్లీని పరోక్షంగా నవీన్ ట్రోల్ చేశాడు. దీంతో కోహ్లీ అభిమానులు అతన్ని టార్గెట్ చేశారు.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్లేయర్లతో నవీన్ ట్రోల్స్ కు గురవ్వడం విశేషం. ఎలిమినేటర్ మ్యాచులో లక్నోపై ముంబై విజయం సాధించిన తర్వాత.. ఆ జట్టు ప్లేయర్ సందీప్ వారియర్, కుమార్ కార్తికేయ, విష్ణు వినోద్.. నవీన్ ను టార్గెట్ చేశారు.
Details
స్వీట్ సీజన్ ఆఫ్ మ్యాంగోస్ అంటూ నవీన్ పై ట్రోల్
ఐపీఎల్ లో ముంబై చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో నవీన్ ఇన్స్టా వేదికగా మామిడి పండ్లను పోస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా 'స్వీట్ సీజన్ ఆఫ్ మ్యాంగోస్' అంటూ నవీన్ ను ట్రోల్ చేశారు.
చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడుకు అన్నట్టుగా మామిడి పండ్లను డైనింగ్ టేబుల్ మీద ఉంచి ఫోటో దిగారు. సందీప్, విష్ణు ఆ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. లక్నో మ్యాచులో నవీన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు.
ఈ క్రమంలో అతను రాహుల్ స్టైల్ లో చెవులు మూసుకొని సంబరాలు చేసుకున్నారు. దీంతో ముంబై ప్లేయర్స్ అతడి మీద రీవెంజ్ తీసుకున్నట్లు సమాచారం.