రాత్రి అంతా పార్టీ చేసుకొని.. తెల్లారి 250 రన్స్ కొట్టిన కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులతో పాటు భారత జట్టు ఛేజింగ్ మాస్టర్, రన్ మెషీన్‌గా ప్రసిద్ధికెక్కాడు.
విరాట్ కోహ్లీ 19 ఏళ్ల వయసులో భారత జట్టులో కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి టీమ్ మేట్స్, దేశవాళీ టోర్నీలో ఈ ఇద్దరూ, టెస్టుల్లోనూ ఎన్నో మ్యాచులను కలిసి ఆడారు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆఖరి టెస్టు ఆడిన ఇషాంత్ శర్మ, టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ చాలా మారిపోయాడని, అప్పటికీ, ఇప్పటికీ అతనిలో చాలా మార్పు వచ్చిందని పేర్కొన్నారు.
Details
విరాట్ కోహ్లీకి టాటూలు అంటే పిచ్చి
విరాట్ కోహ్లీని అండర్-17 నుంచి చూస్తున్నానని, కెరీర్ ఆరంభంలో పార్టీలు, టాటూలు అంటే పడిచచ్చేవాడని, ఇప్పుడేమో అన్నీ మానేసి సుద్ధపూసలా మారిపోయాడని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.
కోల్ కత్తా అండర్ 19 మ్యాచ్ ఆడుతున్నప్పుడు కోహ్లీ నాటౌట్ గా ఉన్నాడని, తర్వాతి రోజు మళ్లీ బ్యాటింగ్ చేయాల్సి ఉందని, కానీ ఆ రోజు నైట్ అంతా కోహ్లీ పార్టీ చేసుకొని, ఆ తెల్లారి 250 పరుగులు చేశాడని పేర్కొన్నారు.
2012 నుండి విరాట్ కోహ్లీ తన ఆహారాన్ని మార్చుకున్నాడని, అతను ఛోలే భటురే తినడం ఇప్పటిదాకా ఒకటో రెండు సార్లు మాత్రమే చూశానని, తానైతే పన్నీర్ నాన్ లాగించేస్తానని ఇషాంత్ వెల్లడించారు.