
Test Retirement: రోహిత్, విరాట్ తర్వాత మరో ప్లేయర్ టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో ఆ తర్వాత జరగే భారత్-ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ సెలక్షన్ కమిటీకి ఎదురవుతున్న సవాళ్లు గణనీయంగా పెరిగిపోయాయి.
ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పగా, మరో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నాడని వార్తలు వెలువడుతున్నాయి.
తాజాగా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా టెస్ట్ జట్టులో స్థానం కోల్పోతున్నట్లు సమాచారం.
గాయాల బారిన పడిన షమీ ఇటీవలే మళ్లీ ఆటకు తిరిగొచ్చినా, అతడి పూర్తి ఫిట్‌నెస్ ఇంకా అనుమానాస్పదంగానే ఉంది.
Details
టీ20 సిరీస్ లో పాల్గొన్న షమీ
2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత కాలిగాయంతో 2024 మొత్తం మిస్ అయిన షమీ, 2025 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిరిగి బరిలోకి దిగాడు.
ఆ తర్వాతి ఛాంపియన్స్ ట్రోఫీ, వాయిదా పడేలోపు ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ పాల్గొన్నాడు. అయితే షమి ఆటతీరు ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.
బీసీసీఐకు అతడు ఇకపై ఆటోమేటిక్ చాయిస్‌గా కనిపించడం లేదు.
బౌలింగ్‌లో రిథమ్ కోల్పోవడం, ఐపీఎల్‌లో రన్‌అప్ కుదరకపోవడం, బంతి పూర్తిగా షార్ప్‌గా వికెట్ కీపర్ వరకు వెళ్లకపోవడం వంటి అంశాలు అతడి ప్రదర్శనపై మచ్చవేసాయి.
ఒక్కో చిన్న స్పెల్ తర్వాత డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Details
పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధించడంతో షమీ విఫలం?
ఈ పరిస్థితుల్లో మరో ప్రధాన బౌలర్ జస్పిత్ బుమ్రా వర్క్‌లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం మరింత పెరిగింది.
గతంలో వీపు గాయంతో బాధపడిన బుమ్రా, ఇప్పుడు ఐదు టెస్టులకు నిరంతరంగా బరిలో ఉండాల్సి వస్తే, అది శరీరానికి భారం కావొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
బీసీసీఐ వర్గాల ప్రకారం, అసలు ప్రణాళిక ప్రకారం బుమ్రా విశ్రాంతి తీసుకుంటే షమిని రంగంలోకి దించాలనుకుంది.
కానీ, షమీ కూడా పూర్తి స్పెల్స్ వేయలేని స్థితిలో ఉంటే, బౌలింగ్ బ్యాలెన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో రోహిత్, విరాట్‌ల తరువాత షమీ కూడా తన క్రికెట్ కెరీర్ చివరి దశకు చేరుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.