టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్!
టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ బాధ్యతలు తీసుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చేతనశర్మ రాజీనామా తర్వాత ఆ స్థానం ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ గా శివశంకర్ దాస్ పని చేస్తున్నాడు. నూతన చీఫ్ సెలెక్టర్ కోసం బీసీసీఐ చెందిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ శుక్రవారం ముంబైలో భేటీ కానుంది. ఇందులో అజిత్ అగార్కార్‌ను తదుపరి చీఫ్ సెలెక్టర్ గా ప్రకటించే అవకాశాలు కనపిస్తున్నాయి. అయితే ఈ సారి మాత్రం చీఫ్ సెలెక్టర్ పదవి చేపట్టేందుకు అజిత్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ జూలై మొదటి వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
గతంలో ఛీప్ సెలెక్టర్ పదవి కోసం పోటీపడ్డ అగాగ్కర్
చీఫ్ సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 వరకు సమయం ఉంది. అయితే హై ప్రొఫైల్ ఉన్న ప్లేయర్‌ను సెలెక్టర్ గా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఆ రోల్‌కు అజిత్ అగార్కర్ సరిపోతాడని అంచనాలు వేస్తోంది. టీమిండియా తరుపున అజిత్ అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడాడు. ఇక టెస్టుల్లో 58 వికెట్లు, వన్డేల్లో 288 వికెట్లు, ఐపీఎల్‌లో 29 వికెట్లు తీశాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతను కామెంటేటర్ గా వ్యవహరించాడు. గతంలో చీఫ్ సెలెక్టర్ పదవి కోసం అగార్కర్ పోటీ పడిన విషయం తెలిసిందే.