IND vs ENG: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా భారీ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది.
యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంతో టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలిపోవడం గమనార్హం.
మూడో టెస్టులో విజయంతో ఐదు మ్యాచ్ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.
భారత తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా శతకాలు బాదగా, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.
టెస్టు
ఐదు వికెట్లతో అదరగొట్టిన జడేజా
టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్, జడేజాల సెంచరీలతో టీమిండియా మొత్తం 445 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో అత్యధికంగా నాలుగు వికెట్లు తీశారు.
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్‌లో 319 పరుగులు చేసింది. ఇందులో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 153 పరుగులు చేయడంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్‌లో జైస్వాల్ (214*), శుభ్‌మన్ గిల్ (91) ధాటికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద డిక్లేర్ చేసింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్.. కేవలం 122 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజాతో 5 వికెట్లతో అదరగొట్టాడు.