Australian Cricket Awards 2024 Winners: మిచెల్ మార్ష్ నుండి ఆష్లీ గార్డనర్ వరకు - అవార్డ్స్ లిస్ట్ ఇదే
గత సంవత్సరం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అవార్డులను అందించింది. మిచెల్ మార్ష్ నుండి ఆష్లీ గార్డనర్ వరకు,2024 ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్‌లో విజేతలందరి జాబితా మీకోసం. స్టార్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ 233 ఓట్లతో ప్రతిష్టాత్మకమైన అలన్ బోర్డర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు.అంతేకాకుండా,వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ పురుషుల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఇక మహిళ విభాగంలో ఆష్లీ గార్డనర్ రెండోసారి బెలిండా క్లార్క్ అవార్డును గెలుచుకొని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆల్ రౌండర్‌లలో ఒకరిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. గార్డనర్ 147ఓట్లను సాధించి,134 ఓట్లను పొందిన ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీపై ఆధిక్యాన్ని పొందారు.
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ పూర్తి లిస్ట్
అలెన్ బోర్డర్ మెడలిస్ట్: మిచెల్ మార్ష్ బెలిండా క్లాక్ అవార్డ్: అశ్లే గార్డ్‌నర్ షేన్ వార్న్ పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: నాథన్ లయన్ పురుషుల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: మిచెల్ మార్ష్ మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ఎల్లిస్ పెర్రీ పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: జాసన్ బెహ్రెండార్ఫ్ మహిళల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ఎల్లిస్ పెర్రీ పురుషుల డొమెస్టిక్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్: కామెరూన్ బెన్‌క్రాఫ్ట్మహిళల డొమెస్టిక్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్: సోఫీ డే, ఎలిస్ విల్లనీ
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ పూర్తి లిస్ట్
బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: ఫెర్గస్ ఓ నీల్ బెట్టీ విల్సన్ యంగ్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్: ఎమ్మా డీ బ్రౌఫ్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డ్: అశ్లే గార్డ్‌నర్ బీబీఎల్ ప్లేయర్ ఆఫ్ టోర్నీ: మాథ్యూ షార్ట్ డబ్ల్యూబీబీఎల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: చమరి ఆటపట్టు వూల్‌వర్త్స్ క్రికెట్ బ్లాస్టర్ ఆఫ్ ది ఇయర్: తాజ్ బోవర్