IPL Auction 2024: ఐపీఎల్ చరిత్రలోనే అల్ టైం రికార్డు ధర.. స్టార్క్‌ను 24.75 కోట్లకు కొన్న కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) అల్ టైం రికార్డు ధర పలికాడు. రూ. 2 కోట్ల కనీస ధర ఉన్న ఈ స్టార్ పేసర్ కోసం ఢిల్లీ, ముంబై, గుజరాత్, కేకేఆర్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరిగా కేకేఆర్ 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ (IPL) చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. తద్వారా సామ్ కర్రన్ రూ. 18.25 కోట్ల రికార్డును కమిన్స్ బద్దలుకొట్టాడు. ఈ మినీ వేలంలో పాట్ కమిన్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లకు కొనుగోలు చేసింది.
తక్కువ ధరకు అమ్ముడుపోయిన హ్యారి బ్రూక్
దుబాయ్లోని కొకాకోలా ఎరేనా హోటల్‌లో జరుగుతున్న ఈ వేలాన్ని మల్లికా సాగర్ (Mallika Sagar) నిర్వహిస్తోంది. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ రూ. 14 కోట్లకు చైన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక భారత పేసర్ హర్షల్ పటేల్‌ను రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. గతేడాది వేలంలో రూ.13.25 కోట్లు పలికిన హ్యారి బ్రూక్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది.