ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు!
ఆసియా కప్ 2023 టైటిల్‌ను భారత్ జట్టు కైవసం చేసుకుంది. కొలంబోలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లంకను 50 పరుగులకు భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. దీనిపై స్థానిక పౌరహక్కుల సంస్థ 'సిటిజెన్ పవర్ అగెనెస్ట్ బ్రైబరీ, కరప్షన్ అండ్ వేస్టెజ్' కొలంబో పోలీస్ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫైనల్ మ్యాచుపై వెంటనే విచారణ కూడా చేయాలని సదురు సంస్థ చైర్మన్ సమంతా తుషార డిమాండ్ చేశారు. క్రికెటర్ల ఆటతీరుపై అనుమానాలు ఉన్నాయంటూ పేర్కొంది.
శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు, ప్లేయర్ల మధ్య జరిగిన సంబాషణను బయటపెట్టాలి
ఆసియా కప్ ఫైనల్ మ్యాచుపై విచారణ జరపాలని శ్రీలంకలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం. స్టేడియంలో మ్యాచు చూసేందుకు బయట ప్రేక్షకులు రాకముందే ఆట పూర్తియైందని, దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని, శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు, ప్లేయర్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలన్నీ బయట పెట్టాలని తుషార పేర్కొన్నాడు. క్రికెట్ ను డబ్బు ప్రభావితం చేస్తోందని, అవినీతిలో కూరుకుపోయిన లంక బోర్డుపై క్రీడా మంత్రి దర్యాప్తును ఆదేశించాలని తుషార పేర్కొన్నారు