LOADING...
Paris Olympics : రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం.. సింధు రికార్డును బద్దలు కొట్టిన అమన్‌
రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం.. సింధు రికార్డును బద్దలు కొట్టిన అమన్‌

Paris Olympics : రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం.. సింధు రికార్డును బద్దలు కొట్టిన అమన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2024
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అమన్ షెరావత్ కొత్త రికార్డును సృష్టించాడు. షెరావత్ 13-5తో ఫ్యూరో రికోకు చెందిన డారియన్ ట్రోయ్ క్రూజ్‌ను ఓడించి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న భారత ఏడో రెజ్లర్‌గా నిలిచాడు. అమన్ షెరావత్ తన కాంస్య పతకాన్ని తన దివంగత తల్లిదండ్రులకు, భారతదేశానికి అంకితం చేశాడు. తన 11వ ఏటనే అమన్ తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఈ కాంస్య పతకంతో 2008 నుండి ప్రతి ఒలింపిక్ క్రీడల్లోనూ భారత్ ఇప్పుడు రెజ్లింగ్‌లో పతకాన్ని గెలుచుకుంటూ వస్తోంది.

Details

అత్యంత పిన్నవయస్సులో పతకం సాధించిన అమన్

భారత్ విశ్వ క్రీడల్లో అత్యంత పిన్న వయస్సులో (21 ఏళ్ల 24 రోజులు) పతకం అందుకున్న అథ్లెట్ గా అమన్ షెరావత్ నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు పీవీ సింధు (21 ఏళ్ల 44 రోజులు) పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డును అమన్ బద్దలు కొట్టాడు. 2016లో పివి.సింధు రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.