Ambati Rayudu: అంబటి రాయుడు సంచలన నిర్ణయం.. కరీబియన్ లీగ్ నుంచి నిష్క్రమణ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023 నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ప్రవీణ్ తాండే తర్వాత కరీబియన్ లీగ్ ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డుకెక్కిన రాయుడు, సీపీఎల్‌కు దూరమయ్యాడు.
ఈ టోర్నీలో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాన్స్ కు ప్రాతినిథ్యం వహించిన రాయుడు, ముచ్చటగా మూడు మ్యాచులను మాత్రమే ఆడాడు.
ఇందులో మొదటి మ్యాచులో డకౌట్ కాగా, మిగతా రెండింట్లో 32, 15 పరుగులు చేశాడు. మొత్తం 3 మ్యాచుల్లో 15.66 సగటుతో 47 పరుగులు చేసి నిరాశపరిచాడు.
ఐపీఎల్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు, భారత దేశవాళీ క్రికెట్‌కు రాయుడు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
Details
వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమైన అంబటి రాయుడు
అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో, ఇక నుంచి పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మారే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు వ్యక్తిగత కారణాలతోనే అంబటి రాయుడు ఈ టోర్నీకి దూరమైనట్లు మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన రాయుడు, ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 204 మ్యాచులను ఆడాడు.
మొత్తం 14 సీజనల్లో 4329 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలను బాదాడు.
ఇక రాయుడుతో పాటు జింబాబ్వే పేసర్ ముజరబాని కూడా ఈ టోర్నీ మధ్యలో నుంచే వైదొలిగాడు.