భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా అమోల్ మంజుదార్ ఫిక్స్!
భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా వెటరన్ క్రికెటర్ అమోల్ మజుందార్ నియామకం అయినట్లు సమాచారం. ఈ మేరకు సీఏసీ ముంబయిలో సోమవారం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. సీఏసీ సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ ప్రాంజ్పే, సులక్షణ నాయక్, మంజుదార్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం మంజుదార్‌తో పాటు జాన్ లూయిస్, తుషార్ అరోథే పోటీ పడ్డారు. గతంలో అరోథే మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేసి 2018లో ఆ పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల జట్టు ఈనెలలో బంగ్లాదేశ్ తో సిరీస్‌ను ఆడనుంది. అంతకంటే ముందే టీమిండియా కోచ్ ని నియమించాలని బీసీసీఐ భావిస్తోందట.
భారత జట్టులో చోటు సాధించలేకపోయిన మంజుదార్
ముజుందార్ భారత జట్టు తరుపున ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ దేశవాళీ క్రికెట్లో 14వేలకు పైగా రన్స్ చేశాడు. ప్రస్తుతం మంజుందార్ ముంబయి రంజీ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్, దక్షిణాఫ్రికా జాతీయ జట్టుతో ఆయన కలిసి పనిచేశారు. మంజుందార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 171 మ్యాచుల్లో 11167 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ లో 113 మ్యాచుల్లో 3286 పరుగులు చేశాడు. అదే విధంగా ఫస్ట్ క్రికెట్లో 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు, లిస్ట్ ఏ లో మూడు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇంత గొప్పగా పరుగులు సాధించనప్పటికీ టీమిండియా జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు.